పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వీటి ధరలు ఒకరోజు పెరిగితే మరోరోజు తగ్గిపోతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,910 పెరిగింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,750 మేరకు పెరిగింది. అయితే, గత రెండు రోజులుగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. అటు వెండి ధరల్లో కూడా ఈ తగ్గుదల కనిపించింది. గత మూడు రోజుల్లో రూ.1,100 మేరకు తగ్గింది.
సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్ధాం. తెలుగు రాష్ట్రాల్లో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్ధాం. 22 క్యారెట్ల బంగారం.. హైదరాబాద్ నగరంలో రూ.83,590గా ఉంటే విజయవాడలో రూ.83,590గా ఉంది. చెన్నైలో ఈ ధరలు రూ.83,590గాను, బెంగుళూరులో రూ.83,740గాను, ఢిల్లీలో రూ.83,740గాను, కోల్‌కతాలో రూ.83,590గాను, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో రూ.83,590గా ఉంది.