స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

ఠాగూర్

సోమవారం, 24 మార్చి 2025 (10:03 IST)
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దంపతులు తమ కుటుంబ సమేతంగా అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడుని ప్రార్థించినట్టు చెప్పారు. స్వర్ణదేవాలయ సందర్శనం మహాభాగ్యంగా భావిస్తున్నట్టు చెప్పారు. 
 
ఈ పర్యటనలో భాగంగా, నారా లోకేశ్ దంపతులు తొలుత అత్యంత పవిత్రంగా భావించే శ్రీ హర్మందర్ సాహిబ్‌ను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్వర్ణదేవాలయం ఆవరణలో గడిపిన సమయం తనకు ఆధ్యాత్మక ప్రశాంతతను అందించిందని తెలిపారు. ఈ పవిత్ర స్థలాన్ని దర్శించే భాగ్యం లభించడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పారు. 
 
ఈ పర్యటనలో నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్‌లు పలు ప్రత్యేకమైన ప్రాంతాలను సందర్శించారు. స్థానికంగా ఉండే కొలను, లంగర్‌ను దర్శించి, గురుద్వారా సేవను అనుభవించారు. దేవాలయ పరిసరాల్లో శాంతి, భక్తిభావాన్ని ఆస్వాదించిన మంత్రి ఈ పుణ్యక్షేత్రం ఎంతో గొప్ప చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి వుంటుందని పేర్కొన్నారు. స్వర్ణదేవాలయ సందర్శన ద్వారా తనకు మరింత మానసిక స్థైర్యం లభించిందని, ఇలాంటి పవిత్ర ప్రదేశాలు అందరికీ శాంతిని అందిస్తాయన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలని దేవుడుని ప్రార్థించినట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు