రూ.66,778లతో చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి బంగారం ధరలు

సెల్వి

గురువారం, 21 మార్చి 2024 (12:12 IST)
బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. బంగారం ధరలు 10 గ్రాముల చరిత్రాత్మక గరిష్ట స్థాయి రూ.66,778కి చేరుకున్నాయి. ఈ ధరలు మునుపటి రోజు ముగింపుతో పోలిస్తే రూ. 1,028 పెరిగాయి. ఇది దాదాపు 1.5 శాతం పెరిగింది.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో, ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు తొలిసారిగా ఔన్స్‌కు 2,200 డాలర్లకు చేరుకున్నాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, చైనా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు కూడా బంగారం ధరలకు ఆజ్యం పోశాయి. 
 
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ వివాదం కూడా బంగారం ధరల పెంపుకు కారణం అయ్యింది. వివాహ సీజన్‌లో దేశీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ స్థిరంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు