తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తూ తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఉజ్వల గ్యాస్ సిలిండర్ రాయితీని రూ.300 పెంచాలని నిర్ణయించినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్రం ప్రస్తుతం రూ.200 రాయితీ ఇస్తుండగా, దీనిని రూ.300కు పెంచుతూ కేబినెట్ నిర్ణయించినట్లు చెప్పారు.