ఎన్‌పీసీఐతో భాగస్వామ్యం చేసుకున్న ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్
బుధవారం, 4 ఆగస్టు 2021 (21:45 IST)
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో భాగస్వామ్యం చేసుకుని యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్ (యుపీఐ) ఆటోపే సదుపాయాన్ని తమ వినియోగదారులకు అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు తమ భీమా పాలసీలను కొనుగోలు చేయడంతో పాటుగా ప్రీమియం చెల్లింపులనూ అత్యంత సౌకర్యవంతంగా తమ ఇంటివద్ద నుంచి సురక్షితంగా చేయవచ్చు.
తమ వినియోగదారులకు యుపీఐ ఆటో పే సదుపాయాలను అందిస్తున్న మొట్టమొదటి జీవిత భీమా కంపెనీగా ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ నిలిచింది. ప్రక్రియను సరళతరం చేయడంతో పాటుగా వినియోగదారులకు సౌకర్యం అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ సదుపాయాలను అందిస్తున్నారు.
జీవిత భీమా పాలసీని వినియోగదారులు కొనుగోలు చేస్తున్న సమయంలో వారు తమ బ్యాంకు ఖాతాలను యుపీఐ ఆటోపేతో లింక్ చేసుకోవడంతో పాటుగా అత్యంత సులభంగా తమ ప్రీమియం చెల్లింపులను తదనంతర కాలంలో చేయవచ్చు. యుపీఐ ఆటోపే ఈ- మ్యాండెడ్‌ను వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ వినియోగించి యాక్టివేట్ చేసుకోవడంతో పాటుగా పేపర్ రహిత విధానంలో తమ ప్రీమియం చెల్లింపుల రెన్యువల్స్ కూడా చేయవచ్చు. అంతేకాదు, ప్రీమియం చెల్లింపులను సమయానికి చేయడంతో పాటుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా తమ పాలసీ ప్రయోజనాలను సైతం వినియోగదారులు పొందవచ్చు.
కోవిడ్–19 కారణంగా ఎదురైన భద్రతా సమస్యలను పరిష్కరిస్తూ ఈ కంపెనీ, తరచుగా సాంకేతికతపై ఆధారపడటంతో పాటుగా తమ వినియోగదారులకు తగిన సాధికారితనూ అందిస్తుంది. కంపెనీ యొక్క డిజిటలైజేషన్ ప్రయాణంలో మరో అడుగుగా ఈ భాగస్వామ్యం నిలువడంతో పాటుగా వినియోగదారులకు క్లిష్టత లేని, సౌకర్యవంతమైన అనుభవాలనూ తమ పాలసీ జీవిత కాలంలో అందిస్తుంది.
వినియోగదారులు ఈ యుపీఐ ఆటోపే ఫీచర్‌ను తమ అభిమాన యుపీఐలు అయినటువంటి పేటీఎం, భిమ్ మొదలైన వాటిపై వినియోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ మరియు ఇతర సుప్రసిద్ధ బ్యాంకులు ఈ– మ్యాండెడ్ ద్వారా అందిస్తాయి. అదనంగా, వినియోగదారులు తమ ప్రాధాన్యతా ఫ్రీక్వెన్సీని ప్రీమియం చెల్లింపులు– ఒకసారి, నెలవారీ, త్రైమాసం, అర్థ సంవత్సరం మరియు సంవత్సరం కోసం నిర్ణయించుకోవచ్చు.
శ్రీ అశీష్ రావు, చీఫ్– కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆపరేషన్స్, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మాట్లాడుతూ, ఎన్‌పీసీఐతో భాగస్వామ్యం చేసుకుని మా వినియోగదారులకు యుపీఐ ఆటోపే చెల్లింపు సదుపాయాలను అందిస్తుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. దీనిద్వారా తక్షణమే తమ ప్రీమియం చెల్లింపులను తమ జీవిత భీమా పాలసీలకు చేసే అవకాశం కలుగుతుంది. మా వినియోగదారుల దీర్ఘకాలిక సేవింగ్ అవసరాలను కాపాడటంతో పాటుగా వారి భద్రతను సైతం కాపాడాలనే మా లక్ష్యంకు అనుగుణంగా సున్నితత్త్వంతో సాంకేతికత మరియు భాగస్వామ్యాలను అందిస్తున్నాము.
మా వినియోగదారుల సేవా నిర్మాణమే, కస్టమర్ ఫస్ట్ ఫిలాసఫీ పునాదిపై నిర్మించబడింది. భౌతిక దూరం అనేది అత్యవసరమైన రోజులలో, యుపీఐ పేమెంట్ విధానం అత్యంత ప్రాధాన్యతా చెల్లింపు మార్గంగా కాంటాక్ట్‌లెస్ మరియు ఫ్రిక్షన్‌లెస్ అనుభవాలను అందిస్తుంది. ఎన్‌పీసీఐ తమ వినియోగదారులకు సురక్షితమైన మరియు భద్రతా వేదికగా నిలుస్తుంది. వినియోగదారులు ఈ-మ్యాండెడ్ సదుపాయాన్ని ఏర్పాటుచేసుకోవడంతో పాటుగా తమ రెన్యువల్ ప్రీమియం చెల్లింపులను చేయవచ్చు. తద్వారా తమ కుటుంబంతో పాటుగా స్వీయ ఆర్ధిక భద్రతకూ భరోసా అందించుకోగలరు అని అన్నారు.
శ్రీ కునాల్ కలవాటియా, చీఫ్ ఆఫ్ ప్రొడక్ట్స్, నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. తద్వారా యుపీఐ ఆటోపే ఇప్పుడు భీమా రంగంలో ప్రవేశించింది. తమ పాలసీల కోసం ప్రీమియం చెల్లింపులను వినియోగదారులు చేసే విధానాన్ని సమూలంగా ఇది మార్చనుంది. యుపీఐ ఆటోపే తో తరచుగా తమ చెల్లింపులను చేస్తున్న మా వినియోగదారులందరికీ అదనపు సౌకర్యం అందించాలన్నది మా ప్రయత్నం.. అని అన్నారు
దేశపు డిజిటల్ వ్యవస్ధపై ఆధారపడి, తమ వేదికలపై సాంకేతికతలను మిళితం చేయడంలో అగ్రగామిగా ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఉంది. ఈ కంపెనీ యొక్క 13వ నెల పెరిసిస్టెన్సీ 87.6%గా 2022 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసంలో ఉంది. జీవిత భీమా పరిశ్రమలో ఇది అత్యుత్తమంలో ఒకటి. వినియోగదారుల నమ్మకం మరియు సౌకర్యవంతమైన, సురక్షితమైన డిజిటల్ చెల్లింపు ఎంపికలను అందించే సామర్థ్యంకు కొలమానంగా ఇది నిలుస్తుంది.