కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ - పన్ను చెల్లింపు పరిమితి పెంపు

ఠాగూర్

శుక్రవారం, 9 ఆగస్టు 2024 (10:58 IST)
భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ ద్వారా పన్ను చెల్లింపు పరిమితిని పెంచింది. ఇప్పటివరకు లక్షగా ఉన్న ఈ పరిమితిని ఇకపై ఐదు లక్షల వరకు పెంచేశారు. ఈ విషయాన్ని గురువారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు గురువారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలను ఆయన వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా యూపీఐ కీలక మార్పు అంశాన్ని ఆయన తెలిపారు. దీంతో వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు జరిపేవారు ఒక లావాదేవీల్లో రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు.
 
యూపీఐ చెల్లింపుల పరిమితిని 2023 డిసెంబర్‌లోనూ సవరించారు. వైద్య ఖర్చులు, విద్యాసంస్థల్లో ఫీజులను యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశాన్ని కల్పించారు. అంతకుముందు, క్యాపిటల్ మార్కెట్లు, బీమా, రెమిటెన్స్ల చెల్లింపుల పరిమితిని కూడా రూ.2 లక్షలకు చేసింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు