శుభవార్త చెప్పిన ఆర్బీఐ.. యూపీఐ లైట్ పరిమితి పెంపు
భారత రిజర్వు బ్యాంకు యూపీఏ యూజర్లకు శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్‌కు సంబంధించి గరిష్ట పరిమితిని పెంచింది. యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ.5 వేలకు పెంచింది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.2 వేలుగా ఉంది. అలాగే, ఒక్కో లావాదేవీ పరిమితిని సైతం రూ.500 నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపింది.