పాత వాహనాల వాడకానికి కేంద్రం బ్రేక్ వేసింది. 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పాత వాహనాలను వాడకూడదనే నియమం అమలులోకి రానుంది. కమర్షియల్ వెహికల్స్.. ట్రక్కులు, బస్సులు ఎనిమిదేండ్ల తర్వాత ఫిట్‌నెస్ సర్టిపికెట్ రెన్యూవల్‌కు వెళ్లినా దాదాపు ఎనిమిది రెట్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మేరకు సోమవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీ, దాని పొరుగు ప్రాంతాల్లో 10 ఏండ్లు దాటిన డీజిల్, 15 ఏండ్లు దాటిన పెట్రోల్ వాహనాల యజమానులపై దీని ప్రభావం ఉండదు. వాటిపై ఇప్పటికే ఢిల్లీలో నిషేధం విధించారు.
ప్రస్తుతం 15 ఏండ్లు దాటిన రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఫీజు రూ.600. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అది రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. ఓల్డ్ బైక్‌ల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చార్జీలు రూ.300 నుంచి రూ.1,000కి పెరుగుతాయి.
ఇక ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకోవడం జాప్యమైతే నెలకు రూ.300, కమర్షియల్ వెహికల్స్‌కు రూ.500 ఫైన్ చెల్లించాల్సిందే. కమర్షియల్ వాహనాల రిజిస్ట్రేషన్‌లో జాప్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధిస్తారు.