కాగా... కరోనా నేపధ్యంలో వ్యాపారుల వినతి మేరకు ఈ గడువును జూన్ ఒకటి వరకు పెంచింది. ఇకపై గడువును పొడగించేది లేదని తాజాగా స్పష్టం చేసింది. కాగా... ఇప్పటివరకు 34,647 మంది వ్యాపారులు బీఐఎస్తో రిజిస్టరయ్యారు. వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు పేర్కొ్న్నారు. మొత్తంమీద... జూన్ ఒకటి నుంచి… 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే విక్రయించేందుకు అనుమతులుంటాయని వెల్లడించారు.