కొనసాగుతున్న పెట్రో - డీజల్ బాదుడు

ఆదివారం, 27 మార్చి 2022 (12:45 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెంపు బాదుడు కొనసాగుతోంది. రోజువారీ ధరల సవరణ సమీక్షను ఈ నెల 22వ తేదీ నుంచి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తిరిగి ప్రారంభించాయి. అప్పటి నుంచి 26వ తేదీ వరకు లీటరు పెట్రోల్‌పై రూ.3.70పై పైసలు, డీజల్‌ లీటరుపై రూ.3.75 చొప్పున పెంచేశాయి. తాజాగా, ఆదివారం కూడా ఈ చమురు సంస్థలు లీటరుపై 50 పైసలు, డీజల్‌పై 55 పైసలు చొప్పున పెంచేశాయి. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.112.37 ఉండగా, డీజల్ ధర రూ.98.69గాఉంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో లీటరు పెట్రోల్ ధర రూ.115.09గా వుంది. డీజల్‌ ధర రూ.101.22గా ఉంది. 
 
ఇక ఏపీలో లీటరు పెట్రోల్ రూ.113.59గా ఉండగా, డీజల్ ధర రూ.99.54గా వుంది. వ్యాట్‌తో కలుపుకుంటే ఆదివారం రాష్ట్రంలో పెట్రోల్ మీద 95 పైసలు, డీజల్ మీద 90 పైసలు చొప్పున పెంచేశారు. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.113.88గా ఉండగా, డీజల్ ధర రూ.98.13గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు