జాతీయ స్థాయి పరీక్ష నీట్ -2020కి దరఖాస్తుకు మరో రెండు రోజుల గడువే మిగిలింది. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష నీట్-2020కి దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 31, 2019 వరకు గడువు తేదీగా నిర్ణయించింది.
కానీ వెబ్‌సైట్‌లో సాంకేతిక కారణాల వల్ల జనవరి 6వ తేదీ వరకు పొడగించారు. ఇటీవల మరోసారి ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీ వరకు నీట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో గడువుకు మరో రెండు రోజులే గడువు తేదీ ఉండడంతో దరఖాస్తు చేసుకోలేని వారికి సదావకాశంగా మారింది.
నీట్‌కు దరఖాస్తు చేస్తున్నవారు మార్చి 27వ తేదీ వరకు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 3వ తేదీన నీట్ ప్రవేశపరీక్షను దేశవ్యాప్తంగా 155 నగరాల్లో నిర్వహించనున్నారు.
మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏఐఐఎంఎస్, జిప్మర్ ప్రవేశ పరీక్షలను నీట్‌లో కలపడం వల్ల దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రవేశ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రం, ఓఎంఆర్ షీట్‌ను మే చివరివారంలో ఆన్‌లైన్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. తుది ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తారు.