నీట్ యూజీ పరీక్షకు అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసిన ఎన్టీఏ

ఠాగూర్

గురువారం, 2 మే 2024 (09:19 IST)
దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్.ఈ.ఈ.టి - నీట్) పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ నెల 5వ తేదీ ఆదివారం జరిగే ఈ పరీక్షకు ఇటీవల సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ.. తాజాగా అడ్మిట్‌ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
నీట్‌ పరీక్షకు ఈసారి 24 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 13 భాషల్లో నిర్వహించే ఈ పరీక్షకు 557 కేంద్రాల్లో, విదేశాల్లో 14 సిటీల్లో ఎన్‌టీఏ అధికారులు ఏర్పాట్లుచేశారు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి విద్యార్థులు తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే 011-40759000 లేదా [email protected]కు ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు