ఆరునెలల పాపాయికి.. చికెన్, మటన్‌ను ఉడికించి?

బుధవారం, 26 డిశెంబరు 2018 (16:54 IST)
ఆరునెలల చిన్నారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలని అనుమానాలున్నాయా? అయితే చదవండి. ఆరు నెలల చిన్నారికి తల్లి పాలతో పాటు పోషకాహారం ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. ఆరు నెలల పాపాయికి జావ రూపంలో ఆహారాన్ని అందివ్వాలి. ఆరు నెలల పాపాయికి బాగా గ్రైండ్ చేసిన ఆహారం ఇవ్వాలి. ఉడికించిన పండ్లు, కూరగాయలను బాగా స్మాష్ చేసి.. రోజుకు మూడు సార్లు ఇవ్వాలి. 
 
స్వీట్ పొటాటో, క్యారెట్, ఆపిల్‌ను ఉడికించి స్మాష్ చేసి అందివ్వాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని పిల్లలకు అందివ్వాలి. బాగా ఉడికిన చికెన్, బాగా ఉడికించిన మటన్‌ను ఎముకలు లేకుండా స్మాష్ చేసి అన్నంతో పాటు జావలా కలిపి ఇవ్వొచ్చు. ఉడికించి చిదిమిన చేపలు, కోడిగుడ్లను కూడా మధ్యాహ్నం పూట అర కప్పు మేర ఇవ్వడం చేస్తే.. పాపాయిలో ఎదుగుదల కనబడుతుంది. కానీ రాత్రి పూట మాత్రం ఆరు నెలల పాపాయికి మాంసాహారాన్ని ఇవ్వడం కూడదు.
 
ఆరు నెలల పాపాయి ఆహారం తీసుకుంటున్నప్పుడు, నీరు తాగేటప్పుడు ఒంటరిగా వదిలి పెట్టకూడదు. ద్రవరూపంలో వుండే ఆహారాన్ని అలవాటు చేయాలి. ఉప్పు, పంచదారను అధికంగా చేర్చుకోకూడదు. చిరుధాన్యాలను ఉడికించి అన్నంతో కలిపి ఇవ్వాలి... ఇలా చేస్తే పాపాయి శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు