పిల్లలను బుద్ధిమంతులుగా చేయండి

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడచూసినాకూడా పిల్లలు పిల్లలుగా ఉండటం లేదు. వారు తమ తల్లిదండ్రులకన్నకూడా పదిరెట్లు తెలివిలో ముందున్నారు. సమాజం అలావుందిమరి. ప్రస్తుతం ఎక్కడ చూసినాకూడా ప్రతిస్పర్ధ(కాంపిటీషన్) పెరిగిపోతోంది. దీంతో పిల్లలుకూడా తాము ప్రతి విషయంలోనూ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అలాంటి వారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.

తమ పిల్లలకు తెలిసిన కొన్ని విషయాలు చదువుకున్న తల్లిదండ్రులకు కూడా తెలియవు. ఈ రోజుల్లో పిల్లలు సునాయాసంగా మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లను సునాయాసంగా ఆపరేట్ చేస్తుంటారు. దీనికంతటికి కారణం వారిలో ప్రతి విషయం గురించి తెలుసుకోవాలనే కోరిక వారిలో ఉండటమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

తమ పిల్లలను ఎలా పెంచాలి :-

** ముందుగా పిల్లల ఇష్టాయిష్టాలను తెలుసుకోండి. వారికి దొరికిన ఖాళీ సమయంలో ఏం చేస్తున్నారనే దానిపైన కూడా కాస్త పరిశీలించండి. వారు దేనిపైన ఎక్కువగా ఇష్టపడుతున్నారనేది మీరు గమనించాలి అంటున్నారు పరిశోధకులు.

** ఒకవేళ మీ పిల్లలు కార్లంటే మక్కువ చూపిస్తుంటే..కార్ల లేటెస్ట్ మోడల్స్ ఏవి అనేది వారికి మీరు తెలపాలి. దానికిసంబంధించిన వివరాలనుకూడా పిల్లలకు తెలుపాలి. ఇంకా వారికి కాయిన్స్ కలెక్షన్‌పై ఇష్టం ఉంటే వాటికి సంబంధించిన కాయిన్స్ పిల్లలకు అందించండి. ఇందులో దేశీయ, విదేశీయ కాయిన్స్ ఉండేలా చూసుకోండి.

** మీ పిల్లలతో స్నేహితులుగా మెలగండి. దీంతో పిల్లలు మీతో సంకోచించకుండా మాట్లాడటానికి ముందుకు వస్తారు. వారికున్న సమస్యలను మీతో చర్చించడానికి ముందుకువస్తారు. వాటిని సానుకూలంగా విని పరిష్కరించడానికి ప్రయత్నించండి.

** మీరు మీ కుటుంబంతో కలిసి పిల్లనుకూడా ఎక్కడికైనాకూడా తీసుకువెళితే..ఆ ప్రాంతపు విశేషాలు వారికి తెలియజేయండి.

** పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. వాటిని ఎట్టి పరిస్థితులలోను దాటేయకండి.

** పిల్లలతో కలిసి మీరుకూడా పిల్లలవలే ఆడుకోవడానికి ప్రయత్నించండి. వారిలో మీపట్ల మరింత అనురాగం ఏర్పడుతుందంటున్నారు మానసిక వైద్యనిపుణులు.

వెబ్దునియా పై చదవండి