గొడ్రాలు ఏడుగురు పిల్లల్ని కంటుంది.. ఆయన పేదలకు..

FILE
"గొడ్రాలు ఏడుగురు పిల్లల్ని కంటుంది.. ఆయన పేదలకు ఆహారాన్ని ఇస్తాడు" అని హన్నా అనే మహిళ యేసుక్రీస్తును ప్రార్థించింది. హన్నా అనే మహిళ ఒక దైవభక్తురాలు. కానీ ఆమె గొడ్రాలు.

అయితే పిల్లల కోసం ఆమె ప్రార్థించినప్పడు దేవుడు ఆమెకు కుమారుడిని ఇచ్చాడు. తన ప్రార్థనను దేవుడు విని, సంతానాన్ని ఇవ్వబోతున్నందుకు ఆమె "గొడ్రాలు ఏడుగురు పిల్లల్ని కంటుంది.. ఆయన పేదలకు ఆహారాన్ని ఇస్తాడు" అని దేవుడిని కొనియాడింది. స్తుతించింది.

ఆమె ఏదైతే విశ్వసించి, కీర్తనలు రాసిందో దేవుడు దాన్ని చేశాడు. ఆమె గొడ్రాలు కానీ ఆరుగురి పిల్లల్ని కన్నది. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళను దేవుడు ఆమెకు ఇచ్చాడు. దేవుడు ఆమెకు ఇచ్చిన మొదటి సంతానమైన సమూయేలును తిరిగి దేవుడి సేవకై అంకితం చేసింది. ఆ విధంగా హన్నా దేవుడిని కీర్తించింది.

వెబ్దునియా పై చదవండి