ఆపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లని ఉంచితే?

మంగళవారం, 9 అక్టోబరు 2018 (22:02 IST)
వంటింట్లో చాలా పదార్థాలను ఎలాబడితే అలా పడేస్తుంటాం. కొన్ని పండ్లను పక్కపక్కనే పెట్టేయడంతో మిగతావి పాడయిపోతాయి. ఐతే ఏవి ఎలా వుంచితే ఎలా అవుతాయో చూద్దాం.
1. పులిహొర చేసేటప్పుడు అన్నం ఉడికే సమయంలో చెంచా నెయ్యి కాని వేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది.
 
2. ఆపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లని ఉంచితే, అవి త్వరగా పండుతాయి.
 
3. కందముక్కలను ఉడికించే నీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క వేస్తే, అవి త్వరగా ఉడుకుతాయి.
 
4. వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను అలాగే వేయటానికి బదులు, పొడి చేసి వేస్తే పదార్థాలు కమ్మటి వాసన వస్తాయి.
 
5. బంగాళాదుంప ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో అరగంట నానబెట్టి వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి.
 
6. కరివేపాకుని ఎండ పెట్టి పొడిచేసి కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు