ఏపీలో ఏం జరుగుతోంది? రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు, 40 మంది మృతి

గురువారం, 16 జులై 2020 (22:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ వ్యాపిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 2,584 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 22,304 శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 2,584 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడింది.
 
ఇందులో 943 మంది చికిత్స నిమిత్తం కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 8, ప్రకాశం 8, చిత్తూరు 5, కడప 4, అనంతపురం 3, గుంటూరు 3, నెల్లూరు 3, విశాఖపట్నం 3, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కరు కరోనా కారణంగా మరణించినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ తెలియజేసింది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు