ఈ కొత్త రకం ఫంగల్ ఇన్ఫెక్షన్పై కోవిడ్ -19 సలహాదారు డాక్టర్ షీటల్ మిస్త్రీ మాట్లాడుతూ, 'ఈ పల్మనరీ ఆస్పర్‌గిలోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ సాధారణంగా రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో కనిపిస్తుంది. ఆస్పర్‌గిలోసిస్ అనేది చాలా అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది కోవిడ్ నుంచి కోలుకున్న లేదా చికిత్స పొందుతున్న రోగుల్లో వచ్చే అవకాశం ఉంది.
ఆస్పెర్‌గిలోసిస్ ఇన్ఫెక్షన్ ముకోర్‌మైకోసిస్ వలె మ్యుటిలేటింగ్ ఇన్ఫెక్షన్ కానప్పటికీ, ఇది ఇన్వాసివ్ ఇన్ఫెక్షన్గా చెప్పవచ్చు. ఇప్పుడు బయటపడుతున్న ఫంగల్ ఇన్ఫెక్షన్లు రినో-ఆర్బిటల్- సెరిబ్రల్ పాసేజ్‌లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్నిఅరుదైన ఇన్ఫెక్షన్గా భావిస్తున్నాం' అని అన్నారు.
ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా డయాబెటిస్ ఉన్న రోగులకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. రక్తంలో తక్కువ లింఫోసైట్లు (లింఫోపెనియా) ఉన్నవారిలో కూడాలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు.
అందువల్ల, ప్రారంభంలోనే దీన్ని కనుగొని చికిత్స చేయించుకోవాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ ఆస్పర్‌గిలోసిస్ ఫంగస్ రంగును ఇంకా వర్గీకరించలేదు. దీనిని వైట్ లేదా యెల్లో ఫంగస్‌గా పిలుస్తున్నాం. కానీ ఇది వేర్వేరు రంగులలో కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది గోధుమ, నీలం-ఆకుపచ్చ, పసుపు- ఆకుపచ్చ, ఆకుపచ్చ, బూడిద రంగుల్లో కనిపిస్తుంది.