కరోనా వ్యాక్సిన్ రాకుండానే కోటి మందికి ఎలా వేస్తారు విజయసాయి రెడ్డిగారు?

బుధవారం, 16 డిశెంబరు 2020 (20:42 IST)
వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్వీట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరోనా వ్యాక్సిన్ ఇంకా రాకముందే డిసెంబర్ 25వ తేదీ కోటి మందికి కరోనా వ్యాక్సిన్లను వేస్తున్నట్లు ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. ఆ తరువాత సరిగ్గా 15 నిమిషాల్లో ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.
 
కరోనాతో ఇప్పటికీ చాలామంది మరణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అస్సలు కరోనా గురించి సరైన శ్రద్థ తీసుకోలేదని ప్రతిపక్షాలు విమర్సిస్తున్నాయి. అయితే కరోనాకు వ్యాక్సిన్ జనవరి నెలలో వచ్చే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించింది. కానీ వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి మాత్రం ఒకడుగు ముందుకు వేసేశారు.
 
డిసెంబర్ నెలలోనే ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లను వేస్తుందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని కోటి మందికి వేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఈరోజు మధ్యాహ్నం పెడితే సరిగ్గా 15 నిమిషాల్లో ఆ ట్వీట్‌ను తిరిగి డిలీట్ చేసేశారు. 
 
అసలు దేశంలోకే వ్యాక్సిన్లు రాకపోతే ఎపిలో ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు నెటిజన్లు. దీంతో ఆలోచనలో పడ్డ విజయసాయిరెడ్డి.. తిట్ల పురాణాన్ని వినలేక వెంటనే డిలీట్ చేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్ పైన ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు