అంబటి రాయుడు బౌలింగ్ యాక్షన్‌పై అనుమానమా..? ఐసీసీ నిషేధం

సోమవారం, 28 జనవరి 2019 (14:52 IST)
హైదరాబాదీ స్టార్ బౌలర్ అంబటి రాయుడిపై సోమవారం ఐసీసీ నిషేధం విధించింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ షాకయ్యారు. అతని బౌలింగ్ స్టైల్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అతని బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలుండటంతో.. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా నిషేధం విధిస్తూ ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన తొలి వన్డేలో అంబటి రాయుడు వేసిన ఆఫ్ స్పిన్ బౌలింగ్ యాక్షన్‌పై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అతడి బౌలింగ్ యాక్షన్‌పై భారత జట్టు మేనేజ్‌మెంట్ ఓ నివేదిక ఇచ్చింది. 
 
14 రోజుల్లో ఐసీసీ నిర్వహించే పరీక్షకు హాజరు కావాలని ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. కానీ బిజీ షెడ్యూల్‌తో రాయుడు ఐసీసీ నోటీసులను పట్టించుకోలేదు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ నియమ నిబంధనల మేరకు అంతర్జాతీయ మ్యాచుల్లో అతడు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు