ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐఎల్టీ20 టోర్నమెంట్‌లో ఆడుతున్న రస్సెల్, అబుదాబి నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శనివారం గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతమైన ఘనతను సాధించాడు. రస్సెల్ తర్వాత, 9,000 T20 పరుగులు సాధించిన అత్యంత వేగవంతమైన ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్ (5,985 బంతులు), కీరన్ పొలార్డ్ (5,988 బంతులు), క్రిస్ గేల్ (6,007 బంతులు), అలెక్స్ హేల్స్ (6,175 బంతులు).
ఆల్ రౌండర్ 536 T20 మ్యాచ్‌లు ఆడి, 26.79 సగటుతో 9,004 పరుగులు, 169.15 స్ట్రైక్ రేట్‌తో రాణించాడు. అతను తన కెరీర్‌లో 31 అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలు నమోదు చేశాడు. టీ20 క్రికెట్‌లో 9,000 పరుగుల మార్కును అధిగమించిన 25వ ఆటగాడిగా రస్సెల్ నిలిచాడు. క్రిస్ గేల్ కేవలం 463 మ్యాచ్‌ల్లో 14,562 పరుగులతో ఆల్ టైమ్ టీ20 రన్ స్కోరర్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.