ఒకే ఒక్క మ్యాచ్‌లో అన్ని రికార్డులా.. ధోనీ ఏమైనా మొనగాడే..(video)

సోమవారం, 4 మార్చి 2019 (17:30 IST)
ధోనీ రికార్డుల మొనగాడు. ఒకే ఒక్క మ్యాచ్‌లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన తొలి వన్డేలో ధోనీ మెరుగైన ఆటతీరుతోనే ఆ మ్యాచ్‌ భారత్ సొంతమైంది. ఈ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడటం ద్వారా టీమిండియాను గెలిపించడమే కాకుండా.. తన ఖాతాలోనూ రికార్డులను వేసుకున్నాడు. 
 
ఆ రికార్డుల సంగతేంటో చూద్దాం.. ధోనీ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో సాధించిన 59 పరుగులతో.. ఈ ఏడాది ఆరు వన్డేలు ఆడిన టీమిండియా ఆటగాడిగా నిలిచాడు. అందులో ఐదు అర్థసెంచరీలను వరుసగా సాధించిన రికార్డు ధోనీ పేరిట వున్నాయి. అందులో నాలుగు అర్థసెంచరీలు ఆస్ట్రేలియాపైనే వరుసగా సాధించినవి కావడం విశేషం. 
 
అలాగే రన్ చేజింగ్‌లో ధోనీ 48 మ్యాచ్‌లో వరుసగా రనౌట్‌గా నిలిచాడు. ధోనీ ఆడిన 48 మ్యాచ్‌లో టీమిండియాను 46 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ టైగా ముగిసింది. మరో మ్యాచ్‌‌లో టీమిండియా పరాజయం పాలైంది. 
 
అలాగే సక్సెస్‌ఫుల్ రన్ చేజింగ్‌లో బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ సాధించిన ఆటగాడిగానూ ధోనీ నిలిచాడు. ఇందులో ధోనీ ప్రపంచంలోనే 103.6 అత్యధిక యావరేజ్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానాల్లో కెప్టెన్ కోహ్లీ (96.2), మైకేల్ బేవన్ (83.6), ఏబీడివిలియర్స్ (82.7)లు నిలిచారు. ఇంకా అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో అత్యధిక విజయాలను నమోదు చేసుకునే మ్యాచ్‌ల్లో ధోనీ 290 మ్యాచ్‌లతో రెండో స్థానంలో వున్నాడు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో వున్నాడు. 
 
ప్రపంచ క్రికెట్‌లో అర్థ సెంచరీ సాధించిన నాటౌట్‌గా నిలిచిన రికార్డు కూడా ధోనీ ఖాతాలో పడింది. 36 మ్యాచ్‌ల్లో అర్థ సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ, కల్లీస్ సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకుంటున్నారు. ఇంకా వన్డేల్లో అత్యధిక అర్థసెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ 71 అర్థ సెంచరీలతో.. గంగూలీని వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచాడు. 
 
ఇంకా ఐదో వికెట్‌కు జోడీ చేరి.. పార్ట్‌నర్‌షిప్‌లో శతకం సాధించిన ఐదో ఆటగాడిగానూ ధోనీ నిలిచాడు. లోయర్ ఆర్డర్‌లో 28 శతకాలు సాధించిన ఆటగాడిగానూ ధోనీ నిలిచాడు. వీటన్నింటికంటే 37 ఏళ్ల ధోనీ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో సింగిల్ రన్‌ను 28 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి సింగిల్ తీశాడు. అదీ 37 ఏళ్ల వయస్సులో 28 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయడం అనేది జోక్ కాదని క్రీడా పండితులు చెప్తున్నారు. ఈ రికార్డులన్నీ ధోనీ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలోనూ సాధించడం ద్వారా ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు