షూ లేసులు కట్టుకోవడం చేతగానివారు కూడా ధోనీ గురించి మాట్లాడితే ఎలా?

శనివారం, 26 అక్టోబరు 2019 (18:02 IST)
ఇటీవలికాలంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి తెగ చర్చ సాగుతోంది. ముఖ్యంగా వరల్డ్ కప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. వీటిని నిజం చేసేలా ధోనీ వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి పేరుతో జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్‌పై పలువురు పలు విధాలుగా మాట్లాడుతున్నారు. 
 
దీనిపై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. భారత క్రికెజ్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి తాను కోరుకున్న సమయంలో రిటైర్మెంట్ ప్రకటించే హక్కు ఉందన్నాడు. ధోనీ రిటైర్మెంట్‌పై మాట్లాడే వారిలో చాలామందికి షూలేసులు కూడా కట్టుకోవడంరాదంటూ మండిపడ్డాడు. 
 
ప్రపంచకప్-2019 సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడిన మ్యాచ్‌లో పాల్గొన్న ధోనీ అనంతరం మళ్లీ ఆడలేదు. జులై 30న టెర్రిటోరియల్ ఆర్మీలో చేరిన ధోనీ జమ్మూ కాకశ్మీరులో సేవలందించాడు. దీంతో ధోనీ వెస్టిండీస్ పర్యటనకు, భారత్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు దూరమయ్యాడు. 
 
తాజాగా బంగ్లాదేశ్ తో టీ 20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారతజట్టులో కూడా ధోనీకి చోటు కల్పించలేదు. దీంతో ధోనీ పని అయుపోయిందని, త్వరలో రిటైర్మెంట్ ప్రకటన చేస్తారని పలువురు చిన్నా పెద్ద క్రికెటర్లు వ్యాఖ్యానిస్తుండటంతో రవిశాస్త్రి సీరియస్ అయ్యాడు.
 
'భారత జట్టుకు ధోనీ 15 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. క్రికెట్ నుంచి ఎప్పుడు వైదొలగాలో అతనికి తెలుసు. అతను రిటైర్ కావాలని మీరు ఎందుకు తొందర పడుతున్నారు? టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ధోనీ ఏమన్నాడో తెలుసా, వృద్ధిమాన్ సాహకు వికెట్ కీపర్ బాధ్యతలు అప్పజెప్పవచ్చు. అతనికి ఆ సామర్థ్యముందన్నాడు. తాను ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలో ఆయనకు తెలియదా? షూలేస్ కూడా కట్టుకోవడం రాని వారు ధోనీ రిటైర్మెంట్ పై మాట్లాడుతున్నారు' అని రవిశాస్త్రి మండిపడ్డాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు