2013లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో గబ్బర్ (ధావన్) కీలక పాత్రను పోషించాడు. ఈ ఎడిషన్‌లో అద్భుత ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డును దక్కించుకున్నాడు. అలాగే, చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా గబ్బర్ పేరుమీదే ఉంది. అటు టోర్నీ చరిత్రలో వరుసగా రెండుసార్లు గోల్డెన్ బ్యాట్ అవార్డును అందుకున్న ఏకైక క్రికెటర్‌గా శిఖర్ ధావన్ కావడం గమనార్హం.
అందుకే గబ్బర్‌కు ఈ అరుదైన గౌవరం దక్కింది. దీనిపై గబ్బర్ స్పందిస్తూ, చాంపియన్స్ ట్రోఫీలో భాగం కావడం చాలా ప్రత్యేక అనుభూతి. ఈ రాబోయే ఎడిషన్‌ను అంబాసిడర్‌గా ఆస్వాదించే అవకాశం లభించడం గౌరవప్రదమైన విషయం. ఇది అభిరుచి, గర్వం, దృఢ సంకల్పం నుంచి పుట్టిన టోర్నమెంట్, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఇది చాలా ఉత్కంఠభరితమైన భావోద్వేగ ప్రయాణంగా మారుతుంది.