ఈ సంస్కరణల్లో భాగంగా, ఐసీసీ తాను చేయాలనుకుంటున్న ఆలోచనలను అభిమానులు ముందు ఉంచింది. వీటిలో ఏ మార్పులు మీరు ఎక్కువగా కోరుకుంటున్నారంటూ చివరి ట్వీట్‌లో ఫ్యాన్స్‌ను ప్రశ్నించింది. యువతకు క్రికెట్‌ను మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
ఇందులోభాగంగా గతంలో కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నది. జులై 2019, జూన్ 2021 మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ నుంచి ఈ మార్పులను ప్రవేశపెట్టనుంది. అందులో భాగంగా టెస్టుల్లో ప్లేయర్స్ జెర్సీలపై వాళ్ల ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌ను ఉంచాలన్నది ఒక ప్రతిపాదన.
అలాగే, ఇక క్రికెట్‌లో టాస్‌కు కూడా గుడ్ బై చెప్పనుంది. టాస్‌కు బదులుగా ట్విట్టర్ పోల్ నిర్వహించనున్నారు. దీనివల్ల అభిమానులే ఎవరు మొదట బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయాలన్నది ట్విట్టర్ పోల్ ద్వారా నిర్ణయించే అవకాశం దక్కనుంది.