భారత్ - శ్రీలంక వన్డే సిరీస్‌కు కొత్త షెడ్యూల్ ఇదే....

శనివారం, 10 జులై 2021 (08:36 IST)
భారత్, శ్రీలంక జట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌ కోసం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించారు. నిజానికి ఈ సిరీస్ ఈ నెల 13వ తేదీన ప్రారంభంకావాల్సివుంది. కానీ, కరోనా కారణంగా నాలుగు రోజులు ఆలస్యంగా ప్రారంభంకానుంది. 
 
కొత్త షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ ఈ నెల 17వ తేదీన జరుగుతుంది. 19న రెండో వన్డే, 21న మూడో వన్డే జరుగుతుంది. టీ20 సిరీస్‌లో భాగంగా, జూలై 24న తొలి టీ20, 25న రెండో టీ20, 27న మూడో టీ20 నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లన్నీ కూడా కొలంబో వేదికగా జరగనున్నాయి.
 
ఇకపోతే, శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తుండగా, రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ జట్టులో అందరూ యువ ఆటగాళ్లే వున్నారు. ప్రతీ ఒక్కరికి కూడా ఆడటానికి ఛాన్స్ లభిస్తుందని గతంలోనే ద్రావిడ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
 
భారత జట్టు వివరాలు.. 
శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యుజ్వేందర్ చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు