వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్- కరుణ్ నాయర్‌కు దక్కని చోటు

సెల్వి

గురువారం, 25 సెప్టెంబరు 2025 (14:48 IST)
వెస్టిండీస్‌తో అక్టోబర్ 2 నుంచి జరగనున్నరెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్‌ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈ జట్టులో కొన్ని కీలకమైన మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు, ఆ టోర్నమెంట్ ముగిసిన వెంటనే వెస్టిండీస్‌లో పర్యటించనుంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ప్రకటించిన జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను జట్టుకు కొత్త వైస్-కెప్టెన్‌గా నియమించారు. టీమిండియాలోకి చాలా కాలం తర్వాత తిరిగి వచ్చిన కరుణ్ నాయర్‌ను ఈ సిరీస్ కోసం పక్కన పెట్టారు. కరుణ్ నాయర్ స్థానంలో యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌కు జట్టులో అవకాశం దక్కింది. 
 
పడిక్కల్ ఇటీవలి దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించడం విశేషం. స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా ఇప్పటికే జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ జట్టులో తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
 
జట్టు వివరాలు 
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్,కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు