సన్నీ లియోన్‌తో విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ముంబై ఎయిర్ పోర్టులో ఎలా?

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (11:33 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్‌తో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో వాలాడట. అవునా.. ఇదేంటి అనుకుంటున్నారు కదూ... అసలు సంగతికి వద్దాం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో, సన్నీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సన్నీలియోన్, విరాట్ కోహ్లీ కలిసి వచ్చారని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ విరాల్ భయానీ కూడా అనుకున్నాడట. 
 
విరాల్ భయానీతో పాటు ముంబై ఎయిర్ పోర్ట్ బీట్ చూసే విలేకరులు సైతం అదే అనుకున్నారు. దగ్గరికి వెళ్లి చూసిన తరువాతే వారికి అసలు విషయం తెలిసింది. అతని పేరు రజానీ. సన్నీ లియాన్‌కు మేనేజర్. వారిద్దరినీ వీడియో తీసిన విరాల్, "ఇతన్ని చూసి కోహ్లీ మ్యాచ్‌ కోసం ముంబై వచ్చాడని అనుకున్నాను" అని కామెంట్ పెట్టాడు.
 
మూడు గంటల వ్యవధిలో ఈ వీడియోను 80 వేల మందికి పైగా వీక్షించారు. రజానీ అచ్చం కోహ్లీలా కనిపిస్తున్నాడని కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు భారీగా షేర్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు