జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్... 90 రోజుల పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్

ఠాగూర్

సోమవారం, 17 మార్చి 2025 (11:58 IST)
మరికొన్ని రోజుల్లో సంపన్న క్రీడగా భావించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ స్వదేశంలో ప్రారంభంకానుంది. దీన్ని పురస్కరించుకుని ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన ప్లాన్లపై జియో వినియోగదారులు 90 రోజుల పాటు ఉచితంగా జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని వెల్లడించింది. 
 
జియో సిమ్ ఉన్న వారు రూ.299 లేదా అంతకన్నా ఎక్కువ రీచార్జ్ చేసుకుంటే ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లను చూడొచ్చని తెలిపింది. అయితే, ఇప్పటివరకు ఉచితంగా చూస్తున్న అభిమానులకు మాత్రం జియో హాట్‌స్టార్ విలీనం రూపంలో షాక్ తగిలింది. మ్యాచ్‌ల కోసం కనీస సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది. 
 
అలాగే, ఐపీఎల్ ప్రసారాల కోం ఇప్పటికే జియో పలు ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను కూడా ప్రకటించింది. ఇందులో రూ.100 ప్లాన్‌పై 90 రోజుల వ్యాలిడిటీతో జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ అందిస్తోది. దీని రీచార్జ్ 5జీబీ డేటా వస్తుంది. అయితే, ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే అని ఎటువంటి కాల్స్, ఎస్ఎంఎస్‌ల సదుపాయం ఇందులో ఉండదని చెబుతోంది. ఇక రూ.949 ప్లాన్‌పైనా ఇలాంటి ఆఫర్ అందిస్తుండగా తాజాగా మరిన్ని ప్లాన్లకు ఈ కాంప్లిమెంటరీ సేవలను జియో విస్తరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు