అయితే, న్యూజిలాండ్ జట్టు తొలిసారి పొట్టి కప్పులో తుది పోరు ఆడబోతుండగా, ఆసీస్‌కిది రెండో ఫైనల్ కావడం గమనార్హం. గత 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన కివీస్.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని భావిస్తుంది.
ఈ మ్యాచ్ కోసం కంగారులు జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన జట్టునే బరిలోకి దించారు. అయితే, కివీస్ జట్టులో గాయం కారణంగా కాన్వే తప్పుకోగా, అతడి స్థానంలో టిమ్ సీఫర్ట్ చేరాడు.
ఇరు జట్ల వివరాలు..
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడం మిల్నే, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మ్యాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆండం జంపా, జోష్ హేజిల్‌వుడ్.