ఆసియా కప్ తర్వాత కోహ్లీ రీ ఎంట్రీ.. విండీస్‌తో తొలి వన్డేలో?

శనివారం, 20 అక్టోబరు 2018 (11:08 IST)
వెస్టిండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఆదివారం జరుగనుంది. ఈ వన్డే కోసం ఇప్పటికే గువహతి చేసుకున్న భారత ఆటగాళ్లు శుక్రవారం ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేశారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ధోని, కేఎల్‌ రాహుల్‌, ఉమేష్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.


తొలి వన్డే గౌహతిలో జరగనుండగా... రెండోవన్డే విశాఖపట్నంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఆదివారం (అక్టోబరు 21)న జరిగే తొలి వన్డేకు 14మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్‌ నియంత్రణమండలి (బీసీసీఐ) ఇప్పటికే ప్రకటించింది. 
 
అరంగేట్ర టెస్టులో అదరగొట్టిన యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ ఈసారి మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. అంతేగాక ఓపెనర్‌గా వన్డేల్లోనూ సత్తా చాటేందుకు పృథ్వీ షా సైతం రేసులో నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 184 పరుగులు చేసిన పంత్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 
 
ఇప్పుడు తొలి వన్డేలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. గాయం కారణంగా శార్దూల్‌ ఠాకూర్‌ తొలి రెండు వన్డేలకు దూరం కావడంతో అతని స్థానంలో ఉమేష్‌ యాదవ్‌ను 14మంది సభ్యుల జాబితాలో వచ్చి చేరాడు. ఆసియా కప్‌ టోర్నీకి విరామం తీసుకున్న విరాట్‌ మళ్లీ వన్డే జట్టులో పునరాగమనం చేసి టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు