భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు!

వరుణ్

గురువారం, 6 జూన్ 2024 (15:10 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును నెలకొల్పారు. ఒక కెప్టెన్‌గా జట్టుకు అత్యధిక విజయాలు అందించాడు. ఈ జాబితాలో ఆయనకు నాలుగో స్థానం దక్కింది. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ విజయాలు నమోదు చేయడంతో ఈ రికార్డు సాధించాడు. తద్వారా మాజీ కెప్టెన్ ధోనీ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. మొత్తం 46 విజయాలతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం మొదటి స్థానంలో ఉన్నాడు. 
 
అమెరికాలో జరుగుతున్న టీ20 టోర్నీలో ఐర్లాండ్‌పై గెలుపుతో 43వ అంతర్జాతీయ టీ20 విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 46 అంతర్జాతీయ టీ20 విజయాలు అందుకున్న వారిలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో బ్రయన్ మసాబా, ఇయాన్ మోర్గాన్ ఉన్నారు. ఇద్దరూ చెరో 44 మ్యాచ్‌ల్లో విజయాలు సొంతం చేసుకున్నారు.
 
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్లు బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) - 81 మ్యాచ్‌ల్లో 46 విజయాలు
బ్రయన్ మసాబా (ఉగాండా) - 57 మ్యాచుల్లో 44 విజయాలు
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్) - 71 మ్యాచుల్లో 44 విజయాలు 
రోహిత్ శర్మ (భారత్) - 55 మ్యాచుల్లో 43 విజయాలు 
అస్టర్ ఆఫ్ఘన్ (ఆఫ్ఘనిస్థాన్) - 52 మ్యాచ్ 42 విజయాలు 
ఎమ్ఎస్ ధోనీ (భారత్) - 72 మ్యాచ్ 42 విజయాలు
ఎరాన్ ఫించ్ (ఆస్ట్రేలియా) - 76 మ్యాచ్ 41 విజయాలు 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు