న్యూజీలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బంతులు వేస్తుంటే కొత్తగా బరిలోకి దిగే బ్యాట్సమన్లకు తడిసిపోతుందని అంటుంటారు. అది నిజంగానే నిజం అన్నట్లు తేలింది శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో. ఇంతకీ అసలు విషయం ఏంటయా అంటే... న్యూజీలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ శ్రీలంక ఆటగాళ్ల గుండెల్లో నిద్రపోయాడు. బంతులు వేస్తుంటే లంకేయులు గజగజ వణికిపోయారంటే అతిశయోక్తి కాదు.
శ్రీలంక రెండో టెస్టు రెండోరోజు ఆటలో ట్రెంట్ వేసిన బంతులకు ఏకంగా ఆరుగురు చిక్కారు. అతడు కేవలం 15 బంతుల్లోనే ఆరు వికెట్లు తీసి లంక జట్టును కోలుకోలేని ఇబ్బందుల్లోకి నెట్టాడు. దీనితో నాలుగు వికెట్లకు 88 పరుగుల వద్ద బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక కేవలం 104 పరుగులకే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆలౌటై చతికిల పడింది. ట్రెంట్ బౌలింగ్ గురించి ఇప్పుడు నెట్లో చర్చించుకుంటున్నారు.