Australia: ప్రాక్టీస్ సెషన్‌లో బంతి తగలడంతో 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ మృతి

సెల్వి

గురువారం, 30 అక్టోబరు 2025 (11:37 IST)
Ben Austin
మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా బంతి తగలడంతో ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రికెటర్ 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ మృతి చెందాడు. 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ మంగళవారం మధ్యాహ్నం ఫర్న్‌ట్రీ గల్లీలోని వ్యాలవీ ట్యూ రిజర్వ్‌లో శిక్షణ తీసుకుంటుండగా ఈ విషాదకర సంఘటన జరిగింది. 
 
బెన్‌ ఆస్టిన్‌ను అతని క్లబ్ ఒక స్టార్ క్రికెటర్, గొప్ప నాయకుడు, పోరాట యోధుడిగా అభివర్ణించింది. బెన్ ఆస్టిన్ ముల్‌గ్రేవ్, ఆల్డెన్ పార్క్ క్రికెట్ క్లబ్‌లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 
 
ఈ యువకుడు నెట్స్‌లో హెల్మెట్ ధరించి బౌలింగ్ మెషీన్ ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. బంతి అతని తల, మెడకు తగిలింది. తీవ్రంగా గాయపడిన బెన్ ఆస్టిన్‌ను మోనాష్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. 
 
వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ బుధవారం ఆ యువ క్రికెటర్ తుదిశ్వాస విడిచాడు. ఫర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ గురువారం ఉదయం ఓ ప్రకటనలో ఈ యువ క్రికెటర్ మరణాన్ని ధ్రువీకరించింది. 
Ben Austin
 
ఆస్టిన్ మరణం 2014 నాటి విషాదంతో పోల్చబడుతోంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా టెస్ట్ బ్యాటర్ ఫిలిప్ హ్యూస్ షెఫీల్డ్ షీల్డ్ ఆట సమయంలో మెడకు బంతి తగలడంతో మరణించాడు. హ్యూస్ మరణం తర్వాత క్రికెట్‌లో కంకషన్ లాంటి అనేక కొత్త నియమాలు వచ్చాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు