పంజాబ్ నుండి పారిపోవాలనుకున్న యువరాజ్ సింగ్, ఏమైంది?

గురువారం, 14 మే 2020 (19:45 IST)
భారత క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆల్‌రౌండర్‌లలో యువరాజ్‌ సింగ్ ఒకడు. భారత జట్టులో స్థిరమైన ఆటతీరును కనబరిచిన యువరాజ్, ఐపీయల్‌కి వచ్చేసరికి ఒక్కో ఏడాది ఒక్కో టీమ్‌లో దర్శనమిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఉన్న అన్ని జట్ల తరపున యూవీ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ వేలంపాట చరిత్రలో ఇప్పటివరకు యువీనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్నాడు. 
 
అయితే ఐపీఎల్‌లో వేర్వేరు జట్లలో ఆడిన యువీ తన అనుభవం గురించి మాట్లాడుతూ.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో గడిపిన సమయాన్ని ఆస్వాదించలేదని, అందుకే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుండి పారిపోవాలనుకున్నానని, తను ఆ జట్టులో ఉండటం యాజమాన్యానికి ఇష్టం లేదని, తాను అడిగింది ఏదీ వారు చేయలేదని, తాను జట్టులో ఉన్నప్పుడు కొనమని చెప్పిన ఆటగాళ్లను తాను జట్టులో నుంచి బయటకు వెళ్లిన తర్వాత కొన్నారని వాపోయాడు. 
 
అయితే తాను పంజాబ్‌ను ప్రేమిస్తున్నాను కాని వారు ఆ ఫ్రాంచైజీని నడిపే విధానం నచ్చలేదని యువరాజ్ తెలిపాడు. చివరగా యువీ 2018లో పంజాబ్ జట్టులో ఆడాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు