ఐసీసీ తమను గుర్తించకపోతే.. అంతే..!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తమను గుర్తించని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని ఐసీఎల్ ఛైర్మన్ కపిల్ దేవ్ హెచ్చరించాడు.

జోహెన్స్‌బర్గ్‌లో ఐసీసీ-బీసీసీఐ, ఐసీసీ తాజా చర్చలు విఫలమైన నేపథ్యంలో... క్రీడాకారుడిగా, క్రీడలకు సంబంధించిన విషయాలు కోర్టులో పరిష్కరించుకోవడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని కపిల్ అన్నాడు. అయితే చర్చలు మళ్లీ విఫలమైతే కోర్టును ఆశ్రయించడం తప్ప తమకు వేరే మార్గం లేదని కపిల్ స్పష్టం చేశాడు.

తమ లీగ్‌కు అధికారిక గుర్తింపు ఇవ్వాలన్న ఐసీఎల్ విజ్ఞప్తిని ఐసీసీ ఏప్రిల్‌లో జరిగే బోర్డు సమావేశంలో చర్చించనుంది. ఈ నేపథ్యంలో... భారత్‌లో క్రికెట్‌ను వ్యాప్తి చేసే పూర్తి అధికారం బీసీసీఐకి ఎవరిచ్చారో తనకు తెలియదని కపిల్ చెప్పాడు. ఐసీఎల్ కూడా క్రికెట్‌ను వ్యాప్తి చేస్తుందని, ఇదే తరహాలో ఐసీఎల్‌కు కూడా గుర్తింపు లభించాలని కపిల్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి