చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ నెగ్గేనా..?

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచెల పోటీల్లో భాగంగా.. ఆదివారం జరిగే 24వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. వరుసగా మూడు విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్‌ రాయల్స్‌ ఆదివారం చెన్నైన సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.

హ్యాట్రిక్‌ ఓటమిలతో కాస్త ఒత్తిడిలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ సేన ఆదివారం అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో వార్న్‌ సేనతో కీలకమ్యాచ్‌ ఆడనుంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచుల్లో కేవలం రెండింటిలో నెగ్గిన చెన్నై సెమీస్‌కు చేరాలంటే ఇక ముందు ఆడే ఎనిమిది మ్యాచుల్లో కనీసం ఆరు నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చెన్నై సూపర్ కింగ్స్‌లో పటేల్, హెడేన్‌, సురేష్ రైనా, బద్రినాథ్, ధోనీ, మోర్కెల్‌లు రాణిస్తే సీఎస్‌కేకు విజయం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రాజస్థాన్‌ కోల్‌కతా, పంజాబ్‌, డెక్కన్‌పై సూపర్‌ విజయాలతో దూసుకుపోతూ ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.

వెబ్దునియా పై చదవండి