87 ఏళ్ల భామ్మ క్రికెట్ మానియా చూసి కోహ్లీ-రోహిత్ ఫిదా...

బుధవారం, 3 జులై 2019 (13:26 IST)
బంగ్లాదేశ్ జట్టుపైన టీమిండియా విజయం నల్లేరుపై నడకలా ఏమీ సాగలేదు. ఉత్కంఠ నడుమ భారత్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల వరకూ సాగింది. 
 
ఐతే ఈ మ్యాచ్‌ను అత్యంత ఆసక్తిగా 87 ఏళ్ల భామ్మ చూస్తూ వుండటం, ఆమెను టీవీ ఛానల్ పదేపదే కవర్ చేయడంతో ఆమె టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలో కళ్లల్లో పడ్డారు. పైగా ఆటలో భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు  చిన్నపిల్లలకు ఏమాత్రం తగ్గకుండా బూర ఊదుతూ ఆమె ఎంజాయ్ చేస్తూ వుండటాన్ని చూసి ఆటగాళ్లతో సహా కామెంటేటర్లు సైతం ఫిదా అయ్యారు. 
 
క్రికెట్ పట్ల బామ్మ చూపిస్తున్న అభిమానానికి ముగ్ధులైన రోహిత్‌, కోహ్లిలు ఆమెను కలిసి థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా కోహ్లి తన ట్విట్టర్ ఖాతాలో ఆమె గురించి చెపుతూ... చారులతా గారికి స్పెషల్‌ థ్యాంక్స్‌. ఆమె వయసు 87 ఏళ్లు. క్రికెట్‌ పట్ల ఇంత పిచ్చి, అంకితభావం ఉన్న ఆమెలాంటి అభిమానిని నేను ఇంతవరకు చూడలేదంటూ ట్వీట్ చేశారు. చూడండి మీరు కూడా...
 

How amazing is this?!

India's top-order superstars @imVkohli and @ImRo45 each shared a special moment with one of the India fans at Edgbaston.#CWC19 | #BANvIND pic.twitter.com/3EjpQBdXnX

— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు