అప్పు ఇచ్చిన మహిళ తల్లిని చంపి ముక్కలు చేసిన కిరాతకులు... ఎక్కడ?

వరుణ్

సోమవారం, 29 జులై 2024 (10:05 IST)
అప్పు ఇచ్చిన పాపానికి ఓ మహిళ తన తల్లిని కోల్పోయింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు రుణం తీసుకున్న వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేందుకు అప్పు ఇచ్చిన మహిళ వృద్ధురాలైన తల్లి వద్ద ఉన్న సొమ్ము నగలను ఆపహరించి ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి కాలువలో పడేశారు. ఈ కిరాతక చర్య తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చెన్నైలోని ఎంజీఆర్ నగర్‌కు చెందిన విజయ(78)అనే వృద్ధురాలు కనిపించకపోవడం వల్ల ఆమె కూతురు లోగనాయకి అనేక ప్రాంతాల్లో గాలించింది. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో జులై 19వ తేదీన విజయ కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విజయ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా జులై 23వ తేదీన విజయ్ ఇంటి సమీపంలో ఉండే పార్తీబన్ పోలీస్ స్టేషన్‍‌కు పిలిపించారు.
 
అయితే అతడు అప్పటికే తన ఇల్లును ఖాళీ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు, పార్తీర్థిన్ మొబైల్ సిగ్నల్స్‌ను ఆరా తీశారు. అతడు విరుదునగర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడి పోలీసులు పార్తీబన్, సంగీత దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎంజీఆర్ నగర్ పోలీసులు వారిని విచారించగా, విజయను హత్య చేసినట్లు పార్తీబన్ దంపతులు అంగీకరించారు. ఆమె వద్ద ఉన్న నగదుతోపాటు బంగారు నగలను దోచుకున్నట్లు చెప్పారు. 
 
ఆ తర్వాత వారిని చెన్నైకు తీసుకొచ్చి తమదైనశైలిలో విచారించగా అనేక విస్మయకర విషయాలు బయటపడ్డాయి. హత్యకు గురైన విజయ కుమార్తె లోగనాయకి వద్ద పార్తీబన్ దంపతులు రూ.20 వేలు అప్పు తీసుకున్నారు. దీంతో డబ్బులు చెల్లించాలని లోగనాయకి ఒత్తిడి తెస్తోంది. అదేసమయంలో విజయ తన సూట్ కేసులో డబ్బులు దాయడాన్ని సంగీత సూచింది. దీంతో ఆ డబ్బు దొంగలించి లోగనాయకికి చెల్లించాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లే విజయ ఇంట్లో ఉన్న సమయంలో సంగీత వెళ్లి సూట్ కేసులోని డబ్బును లాక్కుంది. 
 
దీంతో విజయ గట్టిగా అరవగా, అక్కడే ఉన్న రాడ్డుతో తలపై దాడి చేసింది. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాధితురాలిని తమ ఇంటికి పార్తీబన్ దంపతులు తీసుకెళ్లారు. అక్కడ మృతదేహన్ని ముక్కలుగా నరికి గోనె సంచిలో కుక్కారు. ద్విచక్రవాహనంపై బస్తాను తీసుకెళ్లి ఈస్ట్ జోన్స్ రోడ్డులోని కాలువలో పడిసినట్టు చెప్పారు. ఆ తర్వాత వారిని తీసుకెళ్లి కాలువలో పడేసిన వృద్ధురాలి శరీరపు ముక్కలతో ఉన్న బస్తాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు