ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును బాంబుతో పేల్చివేస్తా!!

వరుణ్

ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (10:20 IST)
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబుతో పేల్చివేస్తామని ఓ వ్యక్తి పీకల వరకు మద్యం సేవించి ఫోన్ చేసి బెదిరించాడు. ఈ బాంబు బెదిరింపు ఫోన్ కాల్ గత నెల 28వ తేదీన వచ్చింది. నిందితుడుని మాత్రం ఈ నెల 17వ తేదీన అరెస్టు చేసినట్టు డిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడుని కృష్ణో మహతోగా గుర్తించారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని చంపారన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఢిల్లీలోని కపషెరాలో కృష్ణోను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. విచారణలో ఫోన్ చేసి బాంబుతో పేల్చివేస్తానని బెదిరించినట్టు అంగీకరించాడని తెలిపారు. 
 
పీకల వరకు మద్యం సేవించి ఈ పనికి పాల్పడ్డాడని తెలిపారు. జనవరి 28వ తేదీన తన మొబైల్ ఫోను నుంచే నిందితుడు ఫోన్ చేశాడని ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా రంగనాని తెలిపారు. ఫోన్ చేసి బెదిరించిన తర్వాత ఫోన్ స్విచాఫ్ చేశాడని, దంతో అతడిని ట్రేస్ చేయడం కష్టంగా మారిందని అందుకే ఆలస్యమైందని తెలిపారు. కాల్ వచ్చిన నంబర్ అడ్రస్ బిహార్ రాష్ట్రంలో ఉండటంతో అక్కడకు వెళ్లి వివరాలు తెలుసుకున్నామని, ఆ తర్వాత ఎట్టకేలకు నిందితుడుని అరెస్టు చేసినట్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు