ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

ఐవీఆర్

మంగళవారం, 25 మార్చి 2025 (17:39 IST)
ఓ యువతి తన ప్రియుడిని తన ఇంటికి ఆహ్వానించింది. వాళ్లిద్దరూ ఆ గదిలో ఏకాంతంగా గడుపుతున్నారు. యువతి గదిలోకి యువకుడు వెళ్లడాన్ని ఆ ఇంటికి ఇరుగుపొరుగున వున్నవారు గమనించారు. అంతే... అంతా కూడబలుక్కుని గది తలుపు తట్టారు. యువతి గది తలుపు తీసింది. అప్పటికే తమ సెల్ ఫోన్లలో కెమేరాలు ఆన్ చేసిన ఇరుగుపొరుగువారు గది లోపల వీడియో తీయడం ప్రారంభించారు. వాళ్లలా తీస్తూ వుండగానే గదిలోని మంచం కింద నుంచి ఆమె ప్రియుడు బైటకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే ఈ వీడియోను చూసిన నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. వాళ్లేమంటున్నారో చూద్దాం.
 
ఇందుకే ఓయో రూమ్స్ వుండాలని చెప్పేది అని ఒకరు కామెంట్ చేసారు. ఐనా వాళ్లద్దరూ అడల్ట్స్. వారికి ఇష్టం వచ్చినట్లు గడపడం వాళ్లిష్టం. మధ్యలో వీళ్లు ఎందుకు వచ్చారు. వీళ్లపై పోలీసు కేసు పెట్టాలని అంటూ ఇంకొకరు కామెంట్ చేసారు. యుక్త వయసు వచ్చాక శరీరంలో హార్మోన్స్ పనిచేస్తాయి. ఉప్పుకారం తిన్నవారు వయసు వచ్చాక ఒంటరిగా ఎలా వుంటారు అంటూ మరొకరు కామెంట్ చేసారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐతే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

प्रेमिका ने प्रेमी को घर बुलाया, किसी ने चुगली कर दी पड़ोसियों ने दरबाजा खोलवाया प्रेमी बेड के नीचे से निकला। #viralvideo pic.twitter.com/vhEdKxRj14

— Abhimanyu Singh Journalist (@Abhimanyu1305) March 25, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు