మిక్సీ వైరును గొంతుకు బిగించి భార్యను చంపేసిన తాపీమేస్త్రీ

ఠాగూర్

శుక్రవారం, 29 ఆగస్టు 2025 (09:07 IST)
మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వక పోవడంతో భార్యను కట్టుకున్న భార్త హత్య చేశాడు. మిక్సీ వైరును భార్య మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఈ కిరాతక భర్త తాపీమేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సాలూరు పట్టణానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి తాపీమేస్త్రీగా పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. అతనితో పాటు భార్య త్రివేణి(38) కూడా గృహ నిర్మాణ పనులకు వెళ్లేది. వచ్చిన కూలి డబ్బులతో మద్యం తాగేసి తరచూ భార్యతో గొడవ పడేవాడు. బుధవారం రాత్రి మద్యం కోసం భార్యను నగదు అడిగాడు. ఆమె నిరాకరించడంతో మిక్సీ వైరును ఆమె మెడకు చుట్టి నులిమేశాడు. దీంతో ఆమె ఆపస్మారక స్థితికి చేరింది. 
 
కుమారుడు, సోదరి వచ్చి చూసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు భార్య మెడలోని బంగారం, ఇంట్లో నగదుతో పరారీ అయ్యాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు