అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

ఐవీఆర్

బుధవారం, 26 మార్చి 2025 (16:29 IST)
బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడైన 37 ఏళ్ల లోక్ నాథ్ సింగ్ అనే వ్యక్తి ఓ ఆటో గ్యారేజ్ సమీపంలో శవమై తేలాడు. అతడి గొంతును పదునైన ఆయుధంతో కోసిన ఆనవాళ్లు వున్నాయి. ఈ హత్య గురించి లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లిద్దరూ తల్లీకూతుళ్లే. కేసు వివరాలు ఇలా వున్నాయి.
 
37 ఏళ్ల లోక్ నాథ్ సింగ్ రియల్టర్. బెంగళూరు నగరంలో ఓ మోస్తరు వ్యాపారస్తుడు. ఇతడు 2023లో 17 ఏళ్ల యశస్విని సింగ్ అనే యువతిని చూసాడు. ఆమెతో మాటలు కలిపాడు. అనంతరం ఆమెను పెళ్లాడుతానంటూ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. యశస్విని తల్లి దగ్గరకు వెళ్లి తల్లీకూతుళ్లను బెదిరించాడు. చివరికి అతడి దెబ్బకు యశస్విని పెళ్లాడేందుకు అంగీకరించింది కానీ దీనికి లోక్ నాథ్ పేరెంట్స్ అంగీకరించలేదు. ఐతే వారిని ఎదిరించి యశస్వినిని గత డిశెంబరులో పెళ్లి చేసుకున్నాడు. మొదటి మూడు నెలలు మామూలుగానే వున్న లోక్ నాథ్ గత కొన్ని రోజుల నుంచి తనలోని కామాంధడుని నిద్రలేపాడు.
 
పిల్లనిచ్చిన అత్తపై కన్నేసాడు. ఆమె వయసు కూడా దాదాపు తన వయసుకి సమానంగా వుండటంతో ఎలాగైనా ఆమెను అనుభవించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో భార్య యశస్వినికి తన మనసులోని కోర్కెను చెప్పాడు. దాంతో యశస్విని ఖంగు తిన్నది. తల్లికి ఈ విషయం చెప్పలేక తల్లడిల్లుతోంది. ఐతే లోక్ నాథ్ ఆగ్రహంతో ఊగిపోతూ... వెంటనే అత్తతో తన కోర్కె తీర్చుకోవాలనీ, లేదంటే పరిస్థితులు మరోలా వుంటాయంటూ బెదిరించాడు. దీనితో అతికష్టమ్మీద విషయాన్ని తల్లికి చెప్పింది యశస్విని. అల్లుడు వరస చూసిన అత్త హేమాబాయి తన కుమార్తెతో కలిసి ఓ ప్రణాళిక రచించింది.
 
అదేమిటంటే.. లోక్ నాథ్ ను హత్య చేసి అడ్డు తొలగించుకోవాలన్నది. ఇందులో భాగంగా పక్కా ప్రణాళిక వేసుకున్నారు. కోర్కె తీర్చుకునేందుకు రమ్మంటూ లోక్ నాథ్ ను పిలిచారు. అతడు వస్తూ వస్తూ బీరు సీసాలను కూడా కొనుక్కుని వచ్చాడు. బాగా తింటూ తాగుతూ వున్న లోక్ నాథ్ ను హత్య చేసేందుకు ఇదే మంచి సమయమని నిశ్చయించుకున్న తల్లీకూతుళ్లిద్దరూ అతడు తాగుతున్న బీరులో నిద్రమాత్రలు వేసారు. అతడు మత్తులోకి జారుకుంటుండగా అక్కడి నుంచి అతడిని కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. మత్తులో జోగుతున్న లోక్ నాథ్ గొంతును పదునైన చాకుతో కోసి హత్య చేసారు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు