సోనూ సూద్ భార్య సోనాలి సూద్ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. నాగపూర్ హైవేపై ప్రయాణిస్తున్న సోనాలి సూద్ కారును అదుపుతప్పిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ చాకచక్యంగా కారును అదుపు చేశారు. దాంతో పెను ప్రమాదం నుంచి సోనాలిసోద్ తప్పించుకున్నారు.