అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ఐవీఆర్

మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (23:12 IST)
కొత్తగా పెళ్లయిన అక్కాబావలతో సరదాగా గడిపేందుకు వచ్చిన మరదలి జీవితాన్ని నాశనం చేసాడు ఓ కామాంధుడు. మరదలు స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఆమె వీడియోను తీసిన బావ ఆ వీడియో చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేసాడు. తన కోర్కె తీర్చకపోతే ఆ వీడియోను నెట్లో పెట్టేస్తానని భయపెట్టడంతో బాలిక అతడికి భయపడి లొంగిపోయింది. ఇక అప్పట్నుంచి ఆమె పట్ల కామపిశాచిగా మారిపోయాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తిక్మాఘర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి 2018లో వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం సందర్భంగా తన సోదరి నిద్రలు కోసం అత్తారింటికి, పుట్టింటికి తిరిగే క్రమంలో అక్కకి తోడుగా చెల్లెలు కూడా వెళ్లింది. అలా తమ ఇంటికి వచ్చిన భార్య సోదరిని కంటికి రెప్పలా చూడాల్సిన బావ కామాంధుడుగా మారిపోయాడు. మరదలు స్నానం చేస్తుండగా వీడియో తీసి దాన్ని ఆమెకి చూపించి బ్లాక్ మెయిల్ చేసాడు.
 
తన కోర్కె తీర్చకపోతే వీడియో బైట పెడతానని బెదిరించడంతో బాలిక అతడికి లొంగిపోయింది. దాంతో గత ఏడేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూనే వున్నాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక యువతి అలా మౌనంగా వుండిపోయింది. ఇంతలో గత ఏడాది ఆమెకి పెళ్లి నిశ్చయమై వివాహం జరిగిపోయింది. వివాహం జరిగింది కదా ఇక తనను వదిలేస్తాడులే అనుకుంటే... ఆ కామాంధుడు ఎంతమాత్రం కనికరించలేదు. 
 
మళ్లీ ఆమెను భయపెడుతూ తన కోర్కె తీర్చుకోవడం ప్రారంభించాడు. దీనితో తన బాధనంతా భర్త ముందు చెప్పేసింది బాధితురాలు. స్వయంగా తన బావ తనపై ఏడేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె బాధను అర్థం చేసుకున్న భర్త... విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు