వాగులో పడి బీటెక్ విద్యార్థి మృతి
సెల్ఫీ సరదా ఓ నిండు ప్రాణం తీసింది. బీటెక్ కుర్రోడు వాగులో పడి మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో ఈ నెల 22వ తేదీన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని కాజీపేటకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ (19) అనే యువకుడు స్థానికంగా ఉండే కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితులు సయ్యద్ జాహెద్‌షా, అబ్దుల్ షాదాబ్‍తో కలిసి గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై కంఠాత్మాకూర్ వాగు వద్దకు చేరుకుని, సెల్ఫీలు తీసుకుంటున్నారు.