Balochistan బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా పాకిస్తాన్ నుంచి విడిపోయిందంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బుధవారం మే 14న ప్రకటించుకున్నది. ఇక అప్పట్నుంచి బలూచిస్తాన్ ప్రాంతాల్లో ప్రతి పట్టణంలో పండగ చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. బలూచిస్తాన్ సెక్యులర్ దేశమనీ, ఇక్కడ ప్రపంచంలోని అన్ని మతాల వారు స్వేచ్ఛగా వుండవచ్చంటూ వెల్లడిస్తున్నారు బలూచ్ బీఎల్ఎ ఉద్యమకారులు.
ఇదిలావుంటే... పాకిస్తాన్ దేశంలోని 40 శాతం భూభాగం కలిగిన బలూచిస్తాన్ ప్రాంతవాసులు స్వతంత్ర దేశంగా విడిపోయినట్లు ప్రకటించిన నేపధ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. బలూచ్ ప్రాంతానికి సైన్యాన్ని పంపుతుంటే అక్కడివారు పాక్ సైనికులపై దాడి చేస్తున్నారు. దశాబ్దాలుగా తమను అణగదొక్కుతున్నారంటూ, ఇకపై అది సాధ్యం కాదంటూ బలూచ్ ఉద్యమకారులు చెబుతున్నారు. మొతమ్మీద పహెల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్ తన కంటిని తనే పొడుచుకున్నట్లయింది.