కళ్లకు ఐలైనర్ ఎలా వేసుకోవాలో తెలుసా?

గురువారం, 19 జులై 2018 (15:06 IST)
కళ్ల అందం కూడా మేకప్‌లో ఒక భాగమే. అవి చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా ఆకట్టుకునేలా, అందంగా కనిపించేలా చేసుకోవాలంటే ఐలైనర్ వేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో ఐలైనర్ల రంగులు కూడా ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఏ రంగు ఎంచుకున్నా కనుల అందం ద్విగుణీకృతం కావాలంటే ఇలా చేస్తే చాలు.
 
రకరకాల రంగుల ఐలైనర్ వాడాలనుకున్నప్పుడు అది సహజ లుక్‌తో కనిపించాలంటే కేవలం కనురెప్పలపై భాగన ఓ గీతలా ఐలైనర్ వేసుకోవాలి. ఒకవేళ మీవి వెడల్పాటి కళ్లు అయ్యుండీ కాస్త చిన్నవిగా కనిపించేలా చేయాలనుకుంటే కనురెప్ప మెుత్తం వేసుకోవాలి. చిన్న రెప్పలపై సగం వరకు మాత్రమే వేసుకోవాలి. దీనివలన కళ్లు విశాలంగా, అందంగా కనిపిస్తాయి.
 
కళ్ల చివర్లో అవుట్‌లైన్‌లా ఐలైనర్‌ను వేసుకోవచ్చు. రాత్రిళ్లు అయితే కనురెప్పల పైన సన్నని గీతలా కాకుండా కాస్త మందంగా అలికినట్లుగా ఐలైనర్ వేసుకుంటే బాగుంటుంది. కనురెప్పల మెుత్తం కళ్లు అడుగున కూడా ఐలైనర్ వేసుకోవడాన్ని ఆల్ రౌండర్ ఐలైనర్ అంటారు. కనురెప్పల పైన కాస్త మందంగా అడుగున సన్నని గీతలా వేసుకోవాలి. కళ్లు చిన్నవిగా ఉన్నవారు ఐలైనర్‌ని ఇలా వేసుకుంటే ఇంకా చిన్నవిగా కనిపిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు