జీన్స్ ప్యాంట్లు రంగులు పోతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే?

శనివారం, 14 జులై 2018 (12:36 IST)
జీన్స్‌ ప్యాంటు ముఖ్యంగా నలుపురంగు జీన్స్‌ని తరచూ ఉతుకుతుంటే రంగు వెలిసినట్లు అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే దాన్ని ఉతికే విషయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
 
వేణ్నీళ్లు వాడితే జీన్స్‌ ప్యాంట్ల మురికి త్వరగా పోతుందనుకుంటారు చాలామంది. కానీ దానివల్ల రంగు త్వరగా వెలిసిపోయే ప్రమాదం ఎక్కువ. పైగా ప్యాంటు పోగులు కూడా పైకిలేచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే తప్పనిసరిగా చల్లటి నీళ్లే వాడాలి.
 
ఈ ప్యాంట్లను వాషింగ్‌మెషీన్‌లో వేయడం కన్నా సాధ్యమైనంత వరకు చేతులతో ఉతకడమే మంచిది. రంగు, మన్నిక తగ్గే ప్రమాదం ఉండదు. చేతులతో ఉతికినా డ్రైయ్యర్‌లో మాత్రం వేయకూడదు. వీటిని వీలైనంతవరకు తక్కువ సమయం నీళ్లలో నానబెట్టాలి. ఆరేసేటప్పుడు తప్పనిసరిగా తిరగేయాలి. అప్పుడే అది రంగు కోల్పోకుండా ఉండాలంటే నీడలోనే ఆరేయాలి.
 
ఆ జీన్స్‌ని మొదటిసారి ఉతుకుతున్నప్పుడు నానబెట్టే నీటిలో అరకప్పు వెనిగర్‌ కొద్దిగా ఉప్పును కలుపుకోవాలి. ఆ నీళ్లలో జీన్స్‌ని ఓ గంట పాటు నానబెడితే రంగు పోదు. ఒకవేళ రకరకాల దుస్తులు కలిపి నానబెడుతోంటే నలుపురంగు జీన్స్‌తోపాటూ ముదురురంగు దుస్తులన్నీ ఒక బకెట్‌లో వేసుకోవాలి. వీటికి సాధారణ సబ్బులు కాకుండా లిక్విడ్‌ డిటర్జెంట్లు ఎంచుకుంటే మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు