మీ అమ్మాయికి పెళ్లి కుదరట్లేదా..? ఐతే ఇలా చేయండి?

FILE
మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కుదరలేదని బాధపడుతున్నారా? ఐతే ఫెంగ్‌షుయ్ సూత్రాలను పాటిస్తే మీ గృహంలో మంగళవాయిద్యాల శబ్ధం వినబడటం ఖాయమని ఆ శాస్త్రనిపుణులు సూచిస్తున్నారు.

మొదట అవివాహిత గదిలో ఒంటిరిగా వున్న ఫోటోలను, పెయింటింగ్‌లను తీసెయ్యండి. ఆ గదిలో ఆరు లేదా 8 రాడ్‌లు ఉన్న విండ్‌చిమ్స్‌లను లేదా క్రిస్టల్స్‌లను వుంచండి. ఇంకా వీలుంటే ఆ గదలో తెల్లటి లేదా పింక్ కలర్ క్యాండింల్స్ ఉంచడం శ్రేయస్కరం.

అలాగే పెళ్ళికి సంబంధించిన వస్తువు పూలగత్తి పెయింటింగ్‌ను మీ అమ్మాయి గదిలో ఉంచండి. ఇది ఆడవారి అదృష్టానికి చిహ్నమని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల పెళ్ళికాని అమ్మాయిలకు త్వరలో వివాహం కుదురుతుందని వారు సూచిస్తున్నారు.

ఇకపోతే.. మీ అమ్మాయి లివింగ్ రూమ్‌లో నైరుతి వైపు పూలగుత్తులతో కూడిన పెయింటింగ్‌లను వుంచితే పెళ్ళి కుదిరే అవకాశాలు ఎక్కువ. అదేవిధంగా మీ అమ్మాయి లివింగ్ రూమ్ తలుపులకు పూలగుత్తుల పెయింటింగ్‌కు వుంచితే చక్కటి భర్త లభిస్తాడు.

అయితే పెళ్లయిన అమ్మాయిలు పూలగుత్తి ఉన్న పెయింటింగ్‌ని హాల్లో లేదా లివింగ్‌రూమ్‌లో ఉంటడం ద్వారా భార్యాభర్తల సంబంధాలు బాగుంటాయి. అంతేకాని పొరపాటున దానిని బెడ్‌రూమ్‌లో వుంచకండి. అందువల్ల మీ భర్త పరస్త్రీల వెంట పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి